ఎన్టీఆర్ డైరెక్షన్ లో జోక్యం చేసుకుంటారా.. అసలు నిజం బయటపెట్టిన సుకుమార్
Actor ProfilePolitician

ఎన్టీఆర్ డైరెక్షన్ లో జోక్యం చేసుకుంటారా.. అసలు నిజం బయటపెట్టిన సుకుమార్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్టీఆర్ డైరెక్షన్ లో జోక్యం చేసుకుంటారా.. అసలు నిజం బయటపెట్టిన సుకుమార్
Zee Telugu11 Aug 2026
ఎన్టీఆర్ డైరెక్షన్ లో జోక్యం చేసుకుంటారా.. అసలు నిజం బయటపెట్టిన సుకుమార్

Sukumar:స్టార్ హీరోలు డైరెక్షన్‌లో జోక్యం చేసుకుంటారనే ప్రచారంపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ డైరెక్షన్‌లో జోక్యం చేసుకోలేదని ఆయన వెల్లడించారు. పెద్ద స్టార్ హీరోలు సినిమాల డైరెక్షన్‌లో జోక్యం చేసుకుంటారనే చర్చ టాలీవుడ్‌లో తరచూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఎన్టీఆర్ విషయంలో అలాంటి ప్రచారం ఎంతవరకు నిజమో దర్శకుడు సుకుమార్ స్వయంగా వెల్లడించారు. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ డైరెక్షన్‌లో జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన సుకుమార్.. నిజం చెప్పినా అబద్ధంలా అనిపించొచ్చు. కానీ ఎన్టీఆర్ ఒక్కసారి కూడా డైరెక్షన్‌లో వేలు పెట్టలేదు అని అన్నారు. అంతేకాదు, తనను హీరోలా ఎలివేట్ చేసే కథ కాకుండా.. కథలో భాగమైన పాత్ర ఇవ్వాలని ఎన్టీఆరే కోరారని చెప్పారు. దీంతో సినిమా మొత్తం పాత్ర సహజంగా ఉండేలా తీర్చిదిద్దినట్లు వివరించారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఎన్టీఆర్ నుంచి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలని తానే అడిగేవాడినని సుకుమార్ చెప్పారు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ కథల ఎంపికలో మార్పు వచ్చిందని, కమర్షియల్ హీరోగా కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాల్లో పాత మాస్ ఎన్టీఆర్ కనిపించేలా రూపొందించానని వెల్లడించారు. ప్రత్యేకంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఎమోషనల్, ఇంటెన్స్ సీన్స్‌లో ఎన్టీఆర్ నటన సినిమాకు పెద్ద బలంగా నిలిచిందని సుకుమార్ పేర్కొన్నారు. నాన్నకు ప్రేమతో చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో విభిన్నమైన చిత్రంగా నిలవడానికి ఆయన చూపిన కమిట్‌మెంట్ కూడా ప్రధాన కారణమని చెప్పారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందనే వార్తలు పలుమార్లు వినిపించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంతో బిజీగా ఉండగా, సుకుమార్ రామ్ చరణ్‌తో తన తదుపరి

ఎన ట ఆర డ ర క షన ల జ క య చ స క ట ర అసల న జ బయటప ట ట న స క మ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in