
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. BJP strategy on Rajya Sabha: భారతీయ జనతా పార్టీ గత 17 లోక్‌సభలో మహిళ బిల్లును ఆమోదించింది. ఇది నియోజకవర్గాల పునర్విభజనకు లింక్ పెడుతూ డీ లిమిటేషన్ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్వభిజన తర్వాత కానీ మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ వర్తించదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు.. మహిళాబిల్లు, డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెడుతూ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు ఒకే చెప్పినా.. అందుకోసం జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మాత్రం ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ బిల్లు లోక్ సభ మూడింటి రెండొంతల మెజారిటీ లేక బిల్లు వీగిపోయింది. దీంతో నరేంద్ర మోడీ సర్కారు రాబోయే రోజుల్లో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం కోసం తన వ్యూహాలకు పదును పెట్టింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు బీజేపీలో విలీనం కావడంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పార్టీలో ముసలం పుట్టింది. దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి తమను ప్రత్యేకంగా గుర్తించాలని చెబుతూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ అందించారు. ఇక లోక్ సభలో కూడా 20 మంది తృణమూల్ పార్టీ ఎంపీలు తమను ప్రత్యేకంగా గుర్తించాలంటూ తమ పార్టీని నేషనల్ సిటీజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో