ఎకరానికి రూ.5 వేలు.. తెలంగాణ సర్కార్ కొత్త స్కీమ్.. రైతన్నలకు సూపర్ న్యూస్
Actor ProfilePolitician

ఎకరానికి రూ.5 వేలు.. తెలంగాణ సర్కార్ కొత్త స్కీమ్.. రైతన్నలకు సూపర్ న్యూస్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఈపీఎఫ్ రూల్స్ మారాయి.. విత్ డ్రా పై ఆంక్షలు.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
10TV Telugu31 Aug 2026
ఈపీఎఫ్ రూల్స్ మారాయి.. విత్ డ్రా పై ఆంక్షలు.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

ఈపీఎఫ్ కొత్త నిబంధనలు అమల్లోకి ఏడాదికి రెండుసార్లే విత్‌డ్రా అవకాశం ఖాతాలో కనీస నిల్వ తప్పనిసరి EPF New Rules: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సామాజిక భద్రత కోడ్‌లో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి

ఎకరానికి రూ.5 వేలు.. తెలంగాణ సర్కార్ కొత్త స్కీమ్.. రైతన్నలకు సూపర్ న్యూస్
10TV Telugu31 Aug 2026
ఎకరానికి రూ.5 వేలు.. తెలంగాణ సర్కార్ కొత్త స్కీమ్.. రైతన్నలకు సూపర్ న్యూస్

ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకం సాగు భూములకే రైతు భరోసా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు Telangana Govt: తెలంగాణలో వరి సాగు విపరీతంగా పెరుగుతుండటంతో, ఇతర పంటల సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యవసాయ విధానాన్ని తీసుకురాబోతోంది. వరికి బదులుగా కందులు, పెసలు, జొన్నలు, మొక్కజొన్న, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ఎకరానికి రూ.4 వేల నుండి రూ.5 వేల వరకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించాలనే కీలక ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరగడం, ధాన్యం కొనుగోళ్లు, సన్న రకాలకు బోనస్ ఇవ్వడం వల్ల రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పప్పుధాన్యాలు, వంటనూనెల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుండటంతో, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. Rythu Bharosa Scheme: రైతుల ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు.. రెండు రోజుల్లోనే రూ.4,072 కోట్ల పంపిణీ.. మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? రైతు భరోసాలో మార్పులు: సాగు భూములకే పెట్టుబడి సాయం: త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా నిబంధనల మార్పుపై కీలక చర్చ జరగనుంది. ఇకపై శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నిజంగా పంటలు సాగు చేస్తున్న భూములను గుర్తించి, వాటికే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాళ్లు, గుట్టలు ఉన్న ప్రాంతాలకు ఈ సాయాన్ని నిలిపివేయనున్నారు. ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రభుత్వానికి(Telangana Govt) ఆదా అయ్యే నిధులను వృథా కానివ్వకుండా, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా పంటల బోనస్, ఉచిత పంటల బీమా వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు: ఇతర మౌలిక వసతులపై చర్చ: ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల తక్కువ నీటితో రైతులకు ఎక్కువ ఆదాయం లభించడమే కాకుండా, భూసారం కూడా