
ఇల్లు అమ్మకానికి పెట్టడం చూశాం... భూమి అమ్మడం చూశాం... కానీ ఒక ఊరినే అమ్మకానికి పెట్టడం ఎప్పుడైనా విన్నారా? నిజమే! ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని ‘కూలాడ్డి’ అనే ఊరు ఇప్పుడు కొత్త యజమాని కోసం ఎదురుచూస్తోంది! ఒకప్పుడు 270 మంది జనాభాతో కళకళలాడిన ఈ ఊరు, రైల్వే మార్గాలు మారిపోవడంతో క్రమంగా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం కేవలం ఇద్దరు నివాసితులతోనే నడుస్తోంది. అందుకే దీనిని ‘ఆస్ట్రేలియాలోనే అతి చిన్న పట్టణం‘ అని కూడా పిలుస్తారు. ఈ ఊరిలో ఒక రోడ్‌హౌస్, మోటెల్, జనరల్ స్టోర్, పబ్, అంతేకాదు నాలుగు నక్షత్రాల రెస్టారెంట్ కూడా ఉన్నాయి. మరి ధర ఎంత అనుకుంటున్నారా? ఈ మొత్తం ఊరు దాదాపు నాలుగు లక్షల ఆస్ట్రేలియా డాలర్లకు, అంటే మన కరెన్సీలో సుమారు రూ. 2.67 కోట్లకు అమ్మకానికి సిద్ధంగా ఉంది! అందుకే, ఇది కొంటే, ఏకంగా ఒక చిన్న రాజ్యాన్నే కొన్నట్టే! అనుకొని చాలామంది వెళ్లారు. కాని, వెళ్లాక వాళ్లకి తెలిసింది ఏమిటంటే, ఈ క్రేజీ డీల్‌తో పాటు బాధ్యతలు కూడా ఫ్రీగా వస్తున్నాయని వెనక్కు వెళ్లిపోతున్నారు. కొత్త యజమాని పోస్టుమ్యాన్ గా, షాప్ యజమానిగా, పబ్ నిర్వాహకుడిగా, మోటెల్ మేనేజర్‌గా, అవసరమైతే వంటమనిషిగా కూడా మారాల్సి ఉంటుంది! సాధారణంగా, ఇల్లు కొంటే ఓ అడ్రస్ వస్తుంది. కానీ ఈ ఊరు కొంటే ఏకంగా మీ సొంత పోస్టల్ కోడ్ కూడా వస్తుంది! నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు) భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు) తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు) తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు) వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్ సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు సోమవారం