
కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం కేరళం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రియదర్శని స్కీమ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి బిందు కృష్ణ సోమవారంనాడు స్వయంగా బస్సు ఎక్కి ప్రయాణం సాగించారు.బస్సు రద్దీగా ఉండటంతో అనుకోకుండా ఆమె తలపై, దుస్తులపై పాయసం ఒలికిపోయింది. తిరువనంతపురం: కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం కేరళం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రియదర్శని' స్కీమ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి బిందు కృష్ణ (Bindu Krishna) సోమవారంనాడు స్వయంగా బస్సు ఎక్కి ప్రయాణం సాగించారు. ఈ సమయంలో ఆమెకు ఊహించని అనుభవం ఎదురయింది. బస్సు రద్దీగా ఉండటంతో అనుకోకుండా ఆమె తలపై, దుస్తులపై పాయసం ఒలికిపోయింది. దీంతో కొద్దిపాటి గందరగోళం నెలకొన్నప్పటీ మంత్రి సంయమనంతో వ్యవహరించి తన కార్యక్రమాన్ని కొనసాగించారు. కొల్లాం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మంత్రి బిందు కృష్ణ రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణించారు. మంత్రికి శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రయాణికులకు పాయసం పంచారు. బస్సు రద్దీగా ఉండటం, పాయసం అందిస్తుండగా అది కదలడంతో పాత్రలోని పాయసం ఆమె తలపై, దుస్తులపై ఒలికింది. ఆమె వెంటనే తుడుచునే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు సహాయం చేయడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 'ప్రియదర్శిని' పథకాన్ని ముఖ్యమంత్రి వీడి సతీశన్ చేతులమీదుగా సోమవారంనాడు ప్రారంభించింది. ఈ పథకం పేద, వర్కింగ్ మహిళలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు. పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సీపీ జాన్, ఎస్సీస ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి కేసీ తులసి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు: అశోక్