
Vladimir Putin| ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌తో ఘర్షణలను ముగించేలా (Ukraine war) అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఇరాన్‌తో ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ తమ దేశంలో పర్యటిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-పుతిన్ (Trump-Putin) మధ్య అలస్కాలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. వాటి గురించి రష్యా అధ్యక్షుడు మాట్లాడారు. ఒప్పందాలు కుదరకపోయినా.. గతంలో చర్చించిన అంశాలపై సంప్రదింపులు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు