ఉక్రెయిన్ దెబ్బకు రష్యా ఖేల్ ఖతం.. ఊహించని సంక్షోభంతో
Actor ProfilePolitician

ఉక్రెయిన్ దెబ్బకు రష్యా ఖేల్ ఖతం.. ఊహించని సంక్షోభంతో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉక్రెయిన్ దెబ్బకు రష్యా ఖేల్ ఖతం.. ఊహించని సంక్షోభంతో
Oneindia Telugu23 Jul 2026
ఉక్రెయిన్ దెబ్బకు రష్యా ఖేల్ ఖతం.. ఊహించని సంక్షోభంతో

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఉక్రెయిన్ దళాలు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై జరిపిన దాడుల కారణంగా ప్రస్తుతం ఊహించని ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారులలో ఒకటైన రష్యాకు ఇది పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా ప్రపంచ దేశాలకు భారీగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే రష్యా, ఇప్పుడు తన సొంత దేశీయ అవసరాల కోసం సముద్ర మార్గం ద్వారా పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలని యోచించడం గమనార్హం. ఉక్రెయిన్ దళాలు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై నిరంతరాయంగా జరిపిన డ్రోన్ దాడులే ఈ అనూహ్య పరిస్థితికి దారితీశాయి. రష్యాలోని కీలక ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేయడంతో ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రవాణా నిలిచిపోయింది. జూన్ 2025 నాటి సగటు రోజువారీ ఉత్పత్తితో పోలిస్తే.. ఇటీవల రష్యాలో పెట్రోల్ ఉత్పత్తి దాదాపు 25 శాతం మేర పడిపోయినట్లు రష్యా వార్తాపత్రిక వెడోమోస్టి పేర్కొన్న నివేదికలను ఉటంకిస్తూ అంతర్జాతీయ సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. డ్రోన్ దాడులతో దెబ్బతిన్న చమురు శుద్ధి కర్మాగారాల్లో అత్యవసర మరమ్మతులు సాగుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామాల వల్ల మే నెలతో పోలిస్తే జూన్ ఆరంభంలో సముద్ర మార్గం ద్వారా జరిగే రష్యా చమురు ఎగుమతులు సుమారు 15 శాతం తగ్గాయి. చమురు కొరత నుంచి గట్టెక్కడానికి రష్యా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, పౌర మౌలిక వసతులపై జరుగుతున్న ఈ దాడులు దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగమని దుయ్యబట్టారు. ప్రస్తుతం రష్యాలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత తీవ్రం కావడంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది

ఉక ర య న ద బ బక రష య ఖ ల ఖత ఊహ చన స క ష భ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in