ITR Deadline Changed: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది జులై 31వ తేదీ. ముఖ్యంగా ఉద్యోగులు ఈ గడువు అందరికీ ఒకేలా వర్తిస్తుందని భావిస్తారు. అయితే, అసెస్మెంట్ ఇయర్ 2026-27లో ఐటీఆర్ క్యాలెండర్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీఆర్ గడువు తేదీల మార్పులను ప్రకటించారు. వివిధ కేటగిరీల ఆధారంగా విడతల వారీగా మార్చారు. మీ ఆదాయ వనరు, అకౌంట్స్ ఆడిట్ అవసరమా లేదా అనే అంశాలపై ఆధారపడి మీ ఐటీఆర్ ఫైలింగ్ డెడ్లైన్ తేదీ జులై 31 కంటే కొన్ని నెలలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మారిన ఐటీఆర్ గడువు రూల్స్ గురించి తెలుసుకుందాం.జులై 31 అందరికీ ఒకే రూల్ కాదు!పన్ను దాఖలు ప్రక్రియను మరింత సులభతంర చేసేందుకు ఒకేసారి సర్వర్లపై భారం పడకుండా గడువు తేదీలను మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫారాలను దాఖలు చేసే వేతనజీవులకు పాత గడువు జులై 31 యథాతథంగా కొనసాగుతుంది. అయితే, వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి పొందుతూ ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు చేసే ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు మాత్రం ఒక నెల అదనపు సమయాన్ని ఇస్తూ ఈ గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారు.అయితే, ఐటీఆర్-3, ఐటీఆర్-4 ఫైల్ చేస్తున్నప్పటికీ ఆడిట్ అవసరమైన ట్యాక్స్ పేయర్లకు గడువు అక్టోబర్ 31 వరకు ఉంటుంది. ఇక ఈ గడువు తేదీలలోపు ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే గడువు దాటి తర్వాత సైతం లేట్ ఫీజుతో బిలేటెడ్ రిటర్నులను డిసెంబర్ 31 వరకు ఫైల్ చేయవచ్చు. గతంలో ఫైల్ చేసిన రిటర్నుల్లో తప్పులను సరిచేసేందుకు రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉంటుంది. వీటితో పాటు సంబంధిత అసెస్మెంట్
Actor ProfilePolitician
ఈ 2026లో గడువు తేదీలు మారాయ్.. మీ డెడ్ లైన్ జులై 31 కాకపోవచ్చు.. సరైన తేదీ ఎప్పుడో
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•17 Jun 2026
ఈ 2026లో గడువు తేదీలు మారాయ్.. మీ డెడ్ లైన్ జులై 31 కాకపోవచ్చు.. సరైన తేదీ ఎప్పుడో