ఈ వారంలోనే సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
Actor ProfilePolitician

ఈ వారంలోనే సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే

Total News2
Movie Updates0
Sources1
త్వరలోనే 10 రెండవ బోర్డు ఫలితాలు
Vaartha15 Jun 2026
త్వరలోనే 10 రెండవ బోర్డు ఫలితాలు

CBSE 10th Second Board Exam Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలోనే 10వ తరగతి రెండవ బోర్డు పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ఫలితాలు బోర్డు అధికారిక

ఈ వారంలోనే సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
Vaartha15 Jun 2026
ఈ వారంలోనే సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే

UPSC CSE Prelims Result 2026: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (CSE Prelims 2026) ఫలితాల విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు ఈ వారంలోనే (జూన్ మూడో వారంలో) కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో అందుబాటులోకి రానున్నాయి. గత నెల మే 24, 2026 న దేశవ్యాప్తంగా ఈ ప్రిలిమ్స్ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగాయి. మొత్తం 933 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు ఏకంగా 8,19,372 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. సుమారు 5.49 lakh (54.9%) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. Read Also :MSBTE Results 2026: విడుదల కానున్న MSBTE ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ ఇదే! ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్ష దేశవ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 కేంద్రాల్లో ఓఎంఆర్ (OMR) ఆధారిత ఆఫ్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో జరిగింది. ఉదయం జనరల్ స్టడీస్ (GS Paper-I), మధ్యాహ్నం సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT Paper-II) నిర్వహించారు. చారిత్రాత్మక మార్పు: యూపీఎస్‌సీ ఈసారి పాత సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. పరీక్ష జరిగిన కేవలం నాలుగు రోజులకే, అంటే మే 28, 2026న ప్రొవిజనల్ కీ (Provisional Answer Key) ని విడుదల చేసింది. గతంలో ఫైనల్ ఫలితాలు వచ్చిన తర్వాత (దాదాపు ఏడాదికి) మాత్రమే కీ ఇచ్చే అలవాటు ఉండేది. ఈ ప్రాథమిక కీ లో మొత్తం 100 ప్రశ్నలకు గాను ఒక ప్రశ్నను కమిషన్ తొలగించింది (Dropped). యూపీఎస్‌సీ సాధారణంగా పరీక్ష ముగిసిన 15 నుండి 20 రోజుల్లోపు ఫలితాలను ప్రకటిస్తుంది. పరీక్ష జరిగి నేటికి (జూన్ 15) 22 రోజులు కావస్తుండటంతో, ఫలితాలు ఏ క్షణంలోనైనా అప్‌లోడ్