
School Holidays 2026-27 : తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి.. కొత్త అకడమిక్ ఇయర్ 2026-27 ప్రారంభమయ్యింది. సమ్మర్ హాలిడేస్ లో బాగా ఎంజాయ్ చేసిన విద్యార్థులు ఉసూరుమంటూ బడిబాట పట్టారు... దాదాపు రెండు నెలల తర్వాత స్కూలుకు వెళ్లాల్సి రావడం ఎవరికైనా బాధే. అయితే విద్యార్థుల్లో ఈ బాధను తగ్గించే ఓ కీలక ప్రకటన చేసింది ఆంధ్ర ప్రభుత్వం. ఇప్పుడు సెలవులు ముగిస్తేనేం... రాబోయే రోజుల్లో భారీగా సెలవులు రాబోతున్నాయని తెలిపింది. ఈ మేరకు అకడమిక్ ఇయర్ లో మొత్తం 229 వర్కింగ్ డేస్ ఉంటాయని... ఏకంగా 87 రోజులు అంటే దాదాపు 3 నెలలు సెలవులేనని విద్యాశాఖ ప్రకటించింది. తెలుగు ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే పండగలు దసరా, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్. ఈ పండగలకు విద్యార్థులు, ఉద్యోగులకు భారీగా సెలవులుంటాయి. ముఖ్యంగా దసరా, సంక్రాంతి పండగలకు ఏపీలో వరుస సెలవులు ఉంటాయి. ఈ పండగలకు ఈసారి ఎన్నిరోజులు సెలవులు వస్తున్నాయో చూద్దాం. సాధారణ పాఠశాలలకు - అక్టోబర్ 12 నుండి 21 వరకు అంటే పదిరోజులు సెలవులు మైనారిటీ పాఠశాలలకు - అక్టోబర్ 15 నుండి 21 వరకు మాత్రమే సెలవులు సాధారణ పాఠశాలలకు - 2026 డిసెంబర్ 25న ఒక్కరోజు మాత్రమే సెలవు ఉంటుంది. మైనారిటీ పాఠశాలలకు - డిసెంబర్ 20 నుండి 27 వరకు అంటే ఏడ్రోజులు సెలవులుంటాయి. సాధారణ పాఠశాలలకు - 2027 జనవరి 11 నుండి 17 వరకు అంటే ఆరురోజులు సెలవులు మైనారిటీ పాఠశాలలకు - జనవరి 13 నుండి 17 వరకు మాత్రమే సెలవులు సాధారణంగా ప్రతి నెలలో నాలుగైదు ఆదివారాలు, రెండో శనివారం కచ్చితంగా ఉంటాయి.. ఈ రోజుల్లో విద్యాసంస్థలకు ఎలాగూ సెలవే. అదనంగా పండగలు, స్థానిక పర్వదినాలు, వేడుకలకు సెలవులు వస్తాయి... వీటిని కలిపితే ప్రతి నెలలో బాగానే హాలిడేస్ ఉంటాయి. ఇలా