
Eenadu•18 Jun 2026
ఇంధన ధరలను వెంటనే తగ్గించలేంఅమెరికా-ఇరాన్ ఒప్పందం నేపధ్యంలో ముడిచమురు ధరలు తగ్గనున్నాయి. అయితే, భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్ గోపి వెల్లడించారు. చమురు ధరల నిర్ధరణలో పలు అంశాలు ఉంటాయని, హర్మూజ్ తెరుచుకున్నా.. ముడిచమురు భారత్‌కు చేరేందుకు సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. దాదాపు రూ.12 వేల కోట్ల మేర కేంద్రం నష్టపోయిందన్నారు. ఇంధన ధరలను వెంటనే తగ్గించలేం: కేంద్రం