ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్ తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది
Actor ProfilePolitician

ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్ తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది

Total News1
Movie Updates0
Sources1
ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్ తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది
Asianet News Telugu17 Jun 2026
ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్ తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్‌లో ఫేక్ పేపర్లు అమ్ముతూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అంతేకాదు, టెలిగ్రామ్‌లో ఉండే ఒక ఫీచర్‌ను వాడుకుని, పరీక్ష అయిపోయిన తర్వాత పేపర్ ముందే లీక్ అయినట్టు ఫేక్ ప్రూఫ్స్ క్రియేట్ చేస్తున్నారని తేలింది. అందుకే జూన్ 22 వరకు టెలిగ్రామ్‌ను బ్యాన్ చేస్తూ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంలో రెండు విడివిడి ఆదేశాలను జారీ చేసింది. మొదటి ఆర్డర్ ప్రకారం.. నీట్ రీ-టెస్ట్ ముగిసే వరకు అంటే జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌ను ఇండియాలో తాత్కాలికంగా నిలిపివేస్తారు. రెండో ఆర్డర్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లోని సెక్షన్ 69A కింద జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ఇప్పటికే పోస్ట్ చేసిన మెసేజ్‌లను ‘ఎడిట్’ చేసే ఫీచర్‌ను ఇండియాలో డిసేబుల్ చేయాలని ఆదేశించింది. టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్లను పెద్ద ఎత్తున డిలీట్ చేసినా లాభం లేకపోవడంతోనే, ఈ సారి పక్కా టైమ్ బౌండ్ ప్లాన్‌తో ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా టెలిగ్రామ్ లో సాగుతున్న మోసాలపై ఎన్‌టీఏ గట్టిగా నిఘా పెట్టింది. పరీక్షలను టార్గెట్ చేస్తూ కొన్ని ఆర్గనైజ్డ్ చీటింగ్ ముఠాలు, సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లు యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించారు. టెలిగ్రామ్‌లో "PAPER LEAKED NEET", "Re-NEET 2026", "Private Mafia", "REE NEET MAFIAA" లాంటి పేర్లతో ఓపెన్‌గా ఛానెళ్లు నడుపుతున్నారని ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ ఛానెళ్ల నిర్వాహకులు.. తమ దగ్గర నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఉందంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నమ్మించి కొన్ని వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. అయితే, సెక్యూర్డ్ ఎగ్జామ్ ప్రాసెస్ వెలుపల ఎలాంటి క్వశ్చన్ పేపర్ లేదని, ఇలా