ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు
Actor ProfilePolitician

ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు

Total News2
Movie Updates0
Sources1
రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం..! జార్ఖండ్ నుంచి గెలిచిన వైసీపీ మాజీ ఎంపీ
Oneindia Telugu18 Jun 2026
రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం..! జార్ఖండ్ నుంచి గెలిచిన వైసీపీ మాజీ ఎంపీ

రాజ్యసభకు జరుగుతున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఇవాళ మరో సంచలనం నమోదైంది. ఒకప్పుడు వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఓ రాజ్యసభ ఎంపీ.. తన పదవీకాలం పూర్తి కావడంతో మరో రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికల్లో

ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు
Oneindia Telugu15 Jun 2026
ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు

తాజాగా దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల ఆలోచనా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా విపక్షాల్లో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ను వరుసగా బీజేపీ దెబ్బతీయడంతో సహజంగానే ఇండియా కూటమిని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం పెరిగింది. దీంతో గతంలో కాంగ్రెస్ కు దూరంగా ఉన్న పార్టీలు సైతం ఇప్పుడు ఇండియా కూటమిలోకి వస్తామని సంకేతాలు ఇస్తున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి (Asaduddin Owaisi) చెందిన ఎంఐఎం (AIMIM)సైతం ముందుకొచ్చింది.ఇండియా కూటమికి హ్యాండిచ్చిన విజయ్.. ! అదిరిపోయే మాస్టర్ ప్లాన్ -అసలు సీక్రెట్ ఇదే!ఈ ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ముఖ్యంగా గత లోక్ సభ ఎన్నికల్లో యోగీ ప్రభావాన్ని దాదాపుగా తగ్గించి, అయోధ్య వంటి స్ధానాల్లోనూ గెలిచి చూపించిన కాంగ్రెస్-సమాజ్ వాదీ పార్టీ కూటమిపై ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో 2022 ఎన్నికల్లో యూపీలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల్చుకోని ఎంఐఏం ఇప్పుడు మరోసారి విపక్ష కూటమితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో తెలిసింది-టీఎంసీ రెబెల్స్ విలీనంపై ఆ పార్టీ బాస్..!ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంకేతాలు ఇచ్చారు. బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు విపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్దమని ఓవైసీ ప్రకటించారు. తమకు తగిన గౌరవం, సమాన హోదా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న పార్టీలతో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తద్వారా ఇండియా కూటమికి తనను చేర్చుకోవాలని ఆయన సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ లో విలీనం దిశగా పిల్ల కాంగ్రెస్ లు..! జగన్ వైఖరి మారుతోందా ?అయితే గతంలో పలు రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా బరిలోకి దిగి