
Lt General Dheeraj Seth: భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. భారత సైన్యానికి నూతన అధిపతిగా (Chief of Army Staff) లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవీ విరమణ చేయనుండటంతో, అదే రోజున ధీరజ్ సేథ్ దేశ రక్షణ రథసారథిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. Read also: Four Maoists granted bail: విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్! నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పూర్వ విద్యార్థి అయిన ధీరజ్ సేథ్, 1986 డిసెంబర్‌లో ఆర్మర్డ్ కార్ప్స్ ద్వారా సైన్యంలో అడుగుపెట్టారు. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ సైనిక జీవితంలో ఆయన ఎన్నో అత్యంత క్లిష్టమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. ఎడారి ప్రాంతాలలో ఆర్మర్డ్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించిన ఆయన, పశ్చిమ సరిహద్దు వెంబడి ఆర్మర్డ్ బ్రిగేడ్ కమాండర్‌గా వ్యూహాత్మక సేవలు అందించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో పాల్గొనే సైనిక దళాలకు కూడా ఆయన దిశా నిర్దేశం చేశారు. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో భారత సైన్యానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక స్ట్రైక్ ఫార్మేషన్లలో ఒకటైన ‘సుదర్శన్ చక్ర కార్ప్స్’ కమాండర్‌గా ధీరజ్ సేథ్ రక్షణ వ్యూహాలను అమలు చేశారు. దీనితో పాటు ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండింగ్‌గా వ్యవహరిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సైనిక వ్యవహారాలను పర్యవేక్షించారు. సమకాలీన సైనిక పరిజ్ఞానం, ఆధునిక యుద్ధ వ్యూహాలపై ఆయనకు ఉన్న అపారమైన పట్టు భారత రక్షణ రంగానికి ఎంతో కీలకం కానుంది. ఇండియన్ ఆర్మీని భవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా ఆధునీకరించడంలో, సరికొత్త సాంకేతికతను జోడించడంలో ధీరజ్ సేథ్ కృషి మరువలేనిది. ఉన్నత స్థాయి సైనిక శిక్షణ పొందిన ఆయన, ఫ్రాన్స్ (ప్యారిస్) లోని ప్రతిష్టాత్మక కమాండ్ అండ్ స్టాఫ్