ఇంట్లోనే కాదు.. లాకర్లలోనూ నోట్ల కట్టలే
Actor ProfilePolitician

ఇంట్లోనే కాదు.. లాకర్లలోనూ నోట్ల కట్టలే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంట్లోనే కాదు.. లాకర్లలోనూ నోట్ల కట్టలే
Eenadu21 Jun 2026
ఇంట్లోనే కాదు.. లాకర్లలోనూ నోట్ల కట్టలే

నరహరిరావు భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను పగలగొట్టిన ఏసీబీ ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, చాంద్రాయణగుట్ట: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయిన ‘సర్వే బందోబస్తు, భూమి రికార్డుల’ కార్యాలయం మల్టీజోన్‌-2 ఉపసంచాలకుడు సుంకరి నరహరిరావు సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఏసీబీ సోదాల చరిత్రలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆయన ఇంట్లో ఏకంగా సుమారు రూ.1.54 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల నిల్వ, మరో రూ.5.04 కోట్ల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో దొరికిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం శాలిబండ కెనరా బ్యాంకులో నరహరిరావు భార్య వందన పేరిట ఉన్న లాకర్లను తెరవగా మరో రూ.1.5 కోట్ల నగదుతోపాటు సుమారు 2 కిలోల మేర బంగారం బిస్కెట్లు, ఆభరణాలు లభ్యం కావడం మరో సంచలనంగా మారింది. ఈ నెల 16న ఏసీబీ బృందాలు నరహరిరావు ఇంట్లో జరిపిన సోదాల్లో ఈ బ్యాంకు లాకర్ల వివరాలను గుర్తించారు. వాటి తాళాలు ఇచ్చేందుకు నరహరిరావు నిరాకరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అనుమతితో సెర్చ్‌ వారెంట్‌ పొందిన ఏసీబీ డీఎస్పీ మాజిద్‌ఖాన్, ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ ఆజాద్‌ బృందం బ్యాంకు లాకర్లను పగలకొట్టగా నోట్ల కట్టలు, బంగారం నిల్వలు బయటపడ్డాయి. మరోవైపు 16న జరిపిన సోదాల్లో లభించిన చర, స్థిరాస్తుల విలువ రూ.13.05 కోట్లు(రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం)గా లెక్కగట్టారు. హైదరాబాద్‌లోని ఛత్రినాక గౌలిపురాకు చెందిన సుంకరి నరహరిరావు పూర్వీకులది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆయనకు వారసత్వంగా ఒక పాత ఇల్లు మాత్రమే వచ్చింది. తండ్రి సర్వేయర్‌గా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద నరహరిరావు 1987లో మండల సర్వేయర్‌గా నియమితులయ్యారు. భార్య గృహిణి కాగా కుమారుడు ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. 2022లో కుమార్తె వివాహం చేశారు. నరహరిరావు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువకాలం సర్వేయర్‌గా, సర్వే సెటిల్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే హైదరాబాద్‌ పరిసరాల్లో స్థిరాస్తి బూమ్‌ రావడంతో భూములకు

ఇ ట ల న క ద ల కర లల న న ట ల కట టల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in