
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Top Diploma Courses After 12th: పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, ఇక తదుపరి అడుగు ఏమిటి అనే సందేహం విద్యార్థుల్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కేవలం డిగ్రీ, బీకాం, బీఎస్సీ లేదా బీటెక్ కోర్సులకే పరిమితం కానక్కర్లేదు; డిప్లమా కోర్సుల ద్వారా కూడా త్వరగా ఉద్యోగంలో చేరవచ్చు. ఈ కోర్సుల్లో ప్రాక్టికల్ శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు, దీనివల్ల విద్యార్థుల్లో నైపుణ్యం (Skill Development) పెరుగుతుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ మరియు జ్ఞానాన్ని అందిస్తూ, ఒకటి నుండి మూడు ఏళ్లలో ఈ కోర్సులను పూర్తి చేసి లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చు. 12వ తరగతి తర్వాత ఉత్తమ డిప్లమా కోర్సులు ఇవే... దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని ముఖ్యమైన డిప్లమా కోర్సులు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ వెబ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ నర్సింగ్, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్. 12వ తరగతి తర్వాత సైన్స్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సులు... సైన్స్ విభాగం విద్యార్థులు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, డిప్లమా ఇన్ నర్సింగ్ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. కామర్స్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సులు