
సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఆ హీరో కూడా తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. ఆమధ్య తిరుమల వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు సాయితేజ్. ఈ రోజు దానికి విరుద్ధంగా ‘ఇంకెక్కడ నాకు పెళ్లి అవుతుంది’ అంటూ స్పందించాడు. కాకపోతే కాస్త కామెడీగానే. ‘హనుమాన్ త్రీడీ’ (HanuMan 3D) ట్రయిలర్ లాంచ్ కార్యక్రమానికి స్పెషల్ గెస్టుగా హాజరయ్యాడు సాయిదుర్గతేజ్. పక్కనే తేజ సజ్జా కూడా ఉన్నాడు. అతడికి అమ్మాయిల నుంచి మంచి ఫాలోయింగ్ వస్తున్న విషయాన్ని సాయితేజ్ గమనించాడు. ఓ అమ్మాయైతే నేరుగా స్టేజ్ పైకి వచ్చి, తేజ సజ్జాకు ఏదో బహుమతి ఇచ్చింది. అతడితో ఫొటో దిగింది. గోముగా తన ప్రేమను వ్యక్తం చేసింది. అదంతా చూసిన సాయితేజ్, యాంకర్ చేతిలో ఉన్న మైక్ అందుకున్నాడు. “ఇంకెక్కడ నా పెళ్లి… ఎవడ్రా నా పెళ్లి గురించి మాట్లాడింది. ఇంకేముంది ఇక్కడ. నా కంటే ముందే పెళ్లి అయిపోతోంది ఇక్కడ.” అంటూ సరదాగా కామెంట్ చేశాడు