ఇషాన్ కిషన్ ఫాస్టెస్ట్ ’ సెంచరీ
Actor ProfilePolitician

ఇషాన్ కిషన్ ఫాస్టెస్ట్ ’ సెంచరీ

Total News1
Movie Updates0
Sources1
ఇషాన్ కిషన్ ఫాస్టెస్ట్ ’ సెంచరీ
Sakshi17 Jun 2026
ఇషాన్ కిషన్ ఫాస్టెస్ట్ ’ సెంచరీ

అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ నిలిచాడు. టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (4) విఫలం కాగా.. రోహిత్‌ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. గిల్‌ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్‌ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్‌ సెంచరీ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్‌పై వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీలు బాదిన క్రికెటర్లు 1.ఇయాన్‌ మోర్గాన్‌ (ఇంగ్లండ్‌)- 2019లో 57 బంతుల్లో శతకం 2. రోహిత్‌ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం 3. ఇషాన్‌ కిషన్‌ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం 4. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం 5. శుబ్‌మన్‌ గిల్‌ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం. ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు) RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా