ఇరాన్ నేతల హత్యకు ఇజ్రాయెల్ స్కెచ్.. భగ్నం చేసిన అమెరికా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
Actor ProfilePolitician

ఇరాన్ నేతల హత్యకు ఇజ్రాయెల్ స్కెచ్.. భగ్నం చేసిన అమెరికా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరాన్ నేతల హత్యకు ఇజ్రాయెల్ స్కెచ్.. భగ్నం చేసిన అమెరికా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
TeluguOne7 Sept 2026
ఇరాన్ నేతల హత్యకు ఇజ్రాయెల్ స్కెచ్.. భగ్నం చేసిన అమెరికా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ఒక భారీ హత్యాకాండకు వ్యూహం రచించిందనే సంచలన నివేదికలు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ది న్యూయార్క్ టైమ్స్ కథనం మేరకు.. ఇరాన్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఇద్దరు అత్యున్నత స్థాయి ప్రతినిధులను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన అమెరికా.. పశ్చిమాసియా దేశాల ద్వారా ఇరాన్‌ను అప్రమత్తం చేసింది. ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్సీ, ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ లు ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం మేరకు ఏప్రిల్ 12న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ లో చర్చలు ముగించుకుని తిరిగి ఇరాన్ వెడుతుండగా, ఇరాన్ స్పీకర్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడానికి రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్ సరిహద్దుల గుండా ఇరాన్ గగన తలంలోకి ప్రవేశించాయి. ఈ సమాచారాన్ని అమెరికా సాయంతో పసిగట్టిన ఇరాన్ రక్షణ వర్గాలు, గాలిబాఫ్ విమానాన్ని వెంటనే ఈశాన్య ఇరాన్‌లోని మషద్ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి.. అక్కడి నుంచి ఆయనను 8 గంటల పాటు రోడ్డు మార్గంలో సురక్షితంగా టెహ్రాన్ చేర్చారు. గాలిబాఫ్ గతంలో జరిగిన దాడుల శిథిలాల నుంచి కూడా రెండుసార్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చర్చల కోసం ముందుకొచ్చిన అలీ లారిజానీ, కమల్ ఖరాజీలను కూడా ఇజ్రాయెల్ హతమార్చింది. అయితే ఏప్రిల్ నుంచి డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ వంటి ప్రతినిధులతో ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించాక.. ఇప్పుడు

ఇర న న తల హత యక ఇజ ర య ల స క చ భగ న చ స న అమ ర క న య య ర క ట మ స స చలన కథన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in