
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Iran America War End: గత కొన్ని రోజులుగా హార్మూజ్ పై టోల్ వసూల్లు చేసుకోవడానికి తమకు అనుమతులు ఇవ్వాలనే షరతుతో అమెరికాతో ఒప్పందాన్ని కాదన్న ఇరాన్ ఎట్టకేలకు దిగివచ్చింది. ఒక వేళ ఇరాన్ పెట్టిన షరతులకు అమెరికా ఒప్పుకుంటే ప్రపంచం ముందు ఆ దేశం పరువు బజారున పడేది. ఎట్టకేలకు హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నామన్నారు. ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చని, చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి అంటూ పోస్ట్ పెట్టారు. ఖమేని అంత్యక్రియలకు ముందే శాంతి ఒప్పందం.. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని క్లారిటీ ఇచ్చింది. అమెరికాపై తమకు ఇంకా భరోసా లేదంది. ఆ దేశం ఎపుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదన్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక విషయాలు వెల్లడించారు. ఇరు దేశాలు ఇప్పటికే ఈ ఒప్పందంపై