ఇమ్మోర్టల్’ నుంచి లవ్
Actor ProfileActor

ఇమ్మోర్టల్’ నుంచి లవ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇమ్మోర్టల్’ నుంచి లవ్-వు లవ్-వు రాకాసి’ సాంగ్.. ఎలా ఉందంటే
Chitrajyothy6 Sept 2026
ఇమ్మోర్టల్’ నుంచి లవ్-వు లవ్-వు రాకాసి’ సాంగ్.. ఎలా ఉందంటే

మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా, కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోన్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘ఇమ్మోర్టల్’. ఈ మూవీ నుంచి తాజాగా ‘లవ్-వు లవ్-వు రాకాసి’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా, కాయదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తోన్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘ఇమ్మోర్టల్’ (Immortal). మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘లవ్-వు లవ్-వు రాకాసి’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యువతను అలరించే క్యాచీ ట్యూన్, ఉత్సాహభరితమైన బీట్‌లతో రూపొందిన ఈ పాట మంచి స్పందనను రాబట్టుకుంటూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకు సామ్ సి.ఎస్ అద్భుతమైన ట్యూన్ అందించగా.. అరవింద్, రేష్మా శ్యామ్ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. ప్రేమలోని సరదా, అల్లరి భావాలను ప్రతిబింబించేలా రాజ్‌శ్రీ సుధాకర్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. మెలోడీ, బీట్, లిరిక్స్ సమన్వయంతో రూపొందిన ఈ పాటలో జి.వి. ప్రకాష్ కుమార్, కాయదు లోహర్‌ల మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కలర్ ఫుల్ విజువల్స్‌తో పాటు.. ఆకట్టుకునే డాన్స్ మూవ్‌మెంట్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో రూపొందిన ఈ పాట సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘రావు బహదూర్’.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు ‘జైలర్ 2’కి పోటీగా.. చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ అప్పుడేనా! మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం ప్రారంభం.. హీరో ఎవరంటే

ఇమ మ ర టల న చ లవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in