
వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉండే ఈ భామ.. తాజాగా 'సూపర్ సుబ్బు' అనే సరికొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఇందులో భాగంగా మిథిలా పాల్కర్ సాంప్రదాయమైన చీరకట్టులో మెరిసిపోయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రమోషన్స్‌లో పక్కా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. అందమైన చీర, దానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించి దేవకన్యలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన అందమైన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సిగ్నేచర్ కర్లీ హెయిర్ (ఉంగరాల జుట్టు)తో పాటు సింపుల్ మేకప్, సరిపోయే ఆభరణాలు ధరించడంతో ఆమె లుక్ మరింత అందంగా తయారైంది. ఆ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారడంతో, అభిమానులు "చీరకట్టులో మిథిలా ఏమన్నా మెరిపిస్తుందా!", "ట్రెడిషనల్ లుక్‌లో అద్భుతంగా ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న మిథిలా పాల్కర్, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటించిన 'సూపర్ సుబ్బు' సిరీస్ పై అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం ఆమె ఎంచుకున్న ఈ ట్రెడిషనల్ స్టైల్ స్టేట్‌మెంట్ సిరీస్‌కు మరింత మైలేజ్ తెచ్చిపెడుతోంది. గ్లామర్ పరంగానే కాకుండా నటనలోనూ తనదైన ముద్ర వేసింది. మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్