
టాలీవుడ్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా అలరిస్తుంది. సినిమాలు, సీరియల్స్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే .. ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానంలో `జంబలకిడిపంబ` చిత్రం అనుకోని విజయం తన కెరీర్‌కు ఎలా మలుపు అయ్యిందో వివరించారు. అదృష్టాన్ని (లక్) తాను చాలా నమ్ముతానని, కొన్నిసార్లు గొప్ప కథాబలం ఉన్న సినిమాలు కూడా ఆడని సందర్భాలుంటాయని అన్నారు. `జంబలకిడిపంబ` సినిమా చిత్రీకరణ దశలో, ఆ తర్వాత విడుదల ముందు పరిశ్రమలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొన్నదని ఆమని గుర్తుచేసుకున్నారు. “ఈ సినిమా ఏం ఆడుతుంది? ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్లుగా మారడం అనేది పిచ్చిగా లేదా?” అని చాలామంది విమర్శించారని ఆమె తెలిపారు. సినిమా ప్రివ్యూలు చూసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సభ్యులు సైతం “ఏంటి ఈ సినిమా? అసలు ఎందుకని? ఇది పిచ్చిగా ఉంది” అని అన్నారని, ఈ విషయం తనను కలవరపరిచిందని ఆమని వెల్లడించారు. షూటింగ్ సమయంలో కూడా “ఈయన ఏం తీస్తున్నాడు? అసలు పిచ్చిగా ఉంది. ఎవరు చూస్తారు ఇది కూర్చుని?” అంటూ యూనిట్‌లోనూ గుసగుసలు వినిపించాయని ఆమె అన్నారు. ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్.. ఆ సమయంలో తాను తీవ్ర ఆందోళన చెందానని, “తెలుగులో ఒక మంచి జీవితం ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ సినిమా విజయం సాధించకపోతే నా పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా నన్ను పక్కన పెట్టేస్తారేమో” అని ఒంటరిగా కూర్చొని భయపడి ఆలోచించానని ఆమని పేర్కొన్నారు. ఆ చిత్రానికి ఈ.వీ.వీ. సత్యనారాయణ వంటి పెద్ద డైరెక్టర్ దర్శకత్వం వహించడం, నరేష్ వంటి నటుడు నటించినా, పరిశ్రమలో నెలకొన్న ప్రతికూల వాతావరణం తనకు