ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది
Actor ProfileActor

ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసింది
TV9 Telugu19 Jun 2026
ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసింది

దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకొని సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించారు దర్శకుడు వంశీ. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఓ అద్భుతమైన సినిమా అన్వేషణ. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక విభిన్నమైన, అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది. ప్రముఖ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ ఈ సినిమా నిర్మాణ విశేషాలు, వంశీ దార్శనికత, ఇళయరాజా అసమాన సంగీత దర్శకత్వం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. వంశీ అంతకుముందు మంచు పల్లకి, సీతార వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. అయితే అన్వేషణతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. అవే కళ్ళు వంటి సస్పెన్స్ చిత్రాల ప్రభావంతో పాటు, ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో ఒక జెకోస్లోవేకియన్ సినిమా చూసి, అడవి నేపథ్యంలో భయానక వాతావరణం సృష్టించాలనే ఆలోచన వంశీకి వచ్చిందట. ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్ కన్నడ చిత్రం అపరిచితను చూసి, దాన్ని కాపీ చేయకుండా, దానికంటే గొప్ప థ్రిల్లర్ తీయాలనే తపనతో అన్వేషణ కథను రూపొందించారు. కథ ఇంకా పూర్తి కాకముందే, వంశీ గారు అన్వేషణ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. కథ రాయడంలో ఇబ్బందులు పడిన వంశీ గారు, నిర్మాతలను ఒప్పించి అరకుకు బయలుదేరారు. 15 రోజులు అరకులో ఒంటరిగా, ప్రకృతితో మమేకమై స్క్రిప్ట్ రాసుకున్నారు. ఒక పచ్చటి ఫైల్‌లో తన ఆలోచనలను నింపుకొని తిరిగి వచ్చారు. ఇక హీరోయిన్ భానుప్రియ గ్లామరస్ పాత్ర చేయాలని కోరగా, వంశీ గారు ఆ డిమాండ్‌ను సినిమాలో భాగంగా చేసుకుని కూరగాయలతో అలంకరించిన నేనవ్వే జాస్మిన్ వైట్ పాటను చిత్రీకరించారు. ఇది కూడా చదవండి : మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్