
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Idupu Kayitham Movie: భాష… భావవ్యక్తీకరణ మాధ్యమం. మానవ పరిణామక్రమంలో ప్రాంతాల వారిగా సందర్భోచితంగా భావాన్ని వ్యక్తీకరించేందుకు, ఆలోచనలను, అనుభవాలను పంచుకోవడానికి వాడే పదసంపద సమాహారమే భాష. ప్రాంతమేదైనా… అక్కడి ప్రజల మధ్య సాగే మాండలిక ఆధారంగా పుట్టుకొచ్చిన మాటలు, పదాల రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. మాటలకే పరిమితంకాదు.. లిఖిత పూర్వక అక్షరాలు, సంకేతాలు, సైగలతో భావాలను వ్యక్తీకరించే శక్తి సామర్థ్యాలు అందులో ఇమిడి ఉంటాయి. భాషకు మూలం గ్రామీణ ప్రాంతాలే.. ఎక్కడ పుడితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా భావ వ్యక్తీకరణకు అమ్మనేర్పిన మాటలే.. మాతృ భాషగా నిలిచింది. భాషలు వేరైనా భావాలు ఒక్కటే… దేశమేదైనా అమ్మనేర్పిన భాషే.. బిడ్డకు మాతృ భాషగా పరిగణిస్తారు. తెలుగుభాష చాలా గొప్పదని కవులు, రచయితలు ప్రపంచానికి చాటి చెప్పారు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. కాలక్రమంలో తెలుగు భాషకు తెగులొచ్చింది. అందుకే తెలుగుభాష మాట్లాడే వారిలో బేధాభిప్రాయాలతో నానారభస చోటుచేసుకుందని అర్థమవుతోంది. సినిమాను డబ్బింగ్ చేస్తారా? అని వంగ్యాస్త్రం.. మాతృ భాష తెలుగే అయినా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాండలికం ఉంటుంది. వాడుక భాషలో మాటలకు అర్థాలు.. మరొక ప్రాంతంలో ఉన్న వారికి తెలియవు. భాష మూలాలు తెలియని కొందరికి.. మాటల్లో అంతరార్థం… తెలియదని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. ఇటీవల పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది ‘ ఇడుపు కాయితం’ సినిమా. తాజాగా ఈ సినిమా టైటిల్ పై సామాజిక మాధ్యమాల్లో రాద్ధాంతం జరుగుతోంది. గ్రామీణ భాషాభావానికి