ఇడుపు కాయితం అంటే పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.!. కవిత సంచలన వ్యాఖ్యలు
Actor ProfilePolitician

ఇడుపు కాయితం అంటే పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.!. కవిత సంచలన వ్యాఖ్యలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇడుపు కాయితం అంటే పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.!. కవిత సంచలన వ్యాఖ్యలు
Zee Telugu8 Aug 2026
ఇడుపు కాయితం అంటే పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.!. కవిత సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. kalvakuntla kavitha fires on deputy cm Pawan kalyan: తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఏ మాత్రం చాన్స్ దొరికిన కూడా నేతలు ఆరోపణలతో ఒకరిపై మరోకరు విరుచుకు పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉప్పల్ లో ప్రత్యేకంగా కార్యక్రమం జరిగింది. దీనికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హజరయ్యారు.టీఆర్ఎస్ పార్టీ జెండా సైతం ఆవిష్కరించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కవిత ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఇడుపు కాయితం సినిమాపేరుపై కొంత మంది ట్రోల్స్ చేయడంతో దీనిపై కవిత ఫైర్ అయ్యారు. ఈ మూవీలో.. ప్రియదర్శి హీరోగా, తెలంగాణ జానపద పాటల ద్వారా పాపులర్‌ అయిన నాగదుర్గ కథానాయికగా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనిపై నెట్టింట ట్రోల్ లు చేయడంతో కవిత మాట్లాడుతూ.. ఇడుపు కాయితం అర్థం పవన్ కళ్యాణ్ ను అడిగితే బాగా చెబుతాడని సెటైర్లు వేశారు. ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లే మళ్లీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారన్నారు. ఆనాడు తెలంగాణను అడ్డుకున్న అనకొండలు, కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్నది బీఆర్ఎస్ లో ఉన్న గుంటనక్కే అని బీఆర్ఎస్ లోని నేతపై ఇన్ డైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గప్ చుప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అని