
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO 3.0: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. దేశంలోని లక్షలాది మంది ఉద్యోగుల కోసం ఒక డిజిటల్ అప్ డేట్ ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఈపీఎఫ్ఓ 3.0 కింద ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే ప్రక్రియను గతంలో కంటే మరింత ఈజీగా వేగవంతంగా మారేలా చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు యూపీఐ తోపాటు ప్రత్యేక ఏటీఎం సౌకర్యల ద్వారా తమ పీఎఫ్ అకౌంట్స్ నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా ఇన్నాళ్లూ సుదీర్ఘమైన కాగితపు పనులు, క్లెయిమ్ స్టేటస్ పదే పదే చెక్ చేసుకోవడం, చాలా రోజుల పాటు ఎదురుచూడటం వంటి ఇబ్బందులు చాలా వరకు తొలగిపోనున్నాయి. EPFO 3.0 అంటే ఏమిటి? EPFO 3.0 అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్. పీఎఫ్ సంబంధిత సేవలన్నింటినీ పూర్తిగా ఆన్‌లైన్‌లో, వేగంగా సులభంగా అందించడమే ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లక్ష్యమని చెప్పాలి. ప్రభుత్వం కొంతకాలంగా EPFO డిజిటల్ సేవలను అప్ డేట్ చేసేందుకు కృషి చేస్తోంది. ఈ చొరవకు మద్దతుగా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కొత్త వ్యవస్థ పరీక్ష విజయవంతంగా పూర్తయిందని, త్వరలో దీనిని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే తెలిపారు. అయితే, అధికారిక ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. UPI, ATM నుండి డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత, అర్హులైన PF సభ్యులు తమ నమోదిత బ్యాంకు ఖాతాకు అనుసంధానించిన UPI ప్లాట్‌ఫారమ్ ద్వారా