ఆ హీరోకు కథ చెప్పడానికి వెళ్తే.. అలా మాట్లాడాడు.. కోపంతో అక్కడి నుంచి వచ్చేశా
Actor ProfileActor

ఆ హీరోకు కథ చెప్పడానికి వెళ్తే.. అలా మాట్లాడాడు.. కోపంతో అక్కడి నుంచి వచ్చేశా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ హీరోకు కథ చెప్పడానికి వెళ్తే.. అలా మాట్లాడాడు.. కోపంతో అక్కడి నుంచి వచ్చేశా
TV9 Telugu22 Jun 2026
ఆ హీరోకు కథ చెప్పడానికి వెళ్తే.. అలా మాట్లాడాడు.. కోపంతో అక్కడి నుంచి వచ్చేశా

1993లో విడుదలైన “రాజేంద్రుడు గజేంద్రుడు” చిత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ వినోదాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నిర్మాణ వెనుక దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ అనుభవాలను పంచుకున్నారు. రాజేంద్రుడు గజేంద్రుడుకు ముందు, ఎస్వీ కృష్ణారెడ్డి తాను ఒక హీరోగా, మరో తమిళ నటుడితో కలిసి ఒక ద్విపాత్రాభినయ కథను రూపొందించాలని అనుకున్నారు. మాతృదేవోభవ వంటి విజవంతమైన చిత్రాలను అందించిన అజయ్ శాంతి దర్శకుడిగా, సత్యానంద్ రచయితగా ఎంపికయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం పాటలు కూడా రికార్డ్‌ చేశారు. అయితే, ఆ సమయంలో చిరంజీవి ఇచ్చిన సలహా మేరకు, తమకు అది సరైన సమయం కాదని భావించి ఆ ప్రాజెక్టును పూర్తిగా విరమించుకోవాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి అన్నారు. ఆ తర్వాత, రాజేంద్రుడు గజేంద్రుడు కథకు ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నారు. మొదట రాజేంద్రప్రసాద్‌ను సంప్రదించినప్పుడు, ఆయన కథకు అంగీకరించినప్పటికీ, కొత్త దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి అనుభవంపై కొంత సందేహం వ్యక్తం చేశారు. ప్రఖ్యాత ల్యాండ్‌డ్రాయింగ్ ఆర్టిస్ట్ జయదేవ్ చేత సన్నివేశాల బొమ్మలు వేయించి, ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా వివరించినప్పటికీ, రాజేంద్రప్రసాద్ అప్పటికే నన్ను కాకుండా వేరే దర్శకుడిని చూస్తే బావుంటుందేమో అని తన అభిప్రాయాన్ని చెప్పారని కృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌లోని ఈ సందేహాన్ని గమనించిన ఎస్వీ కృష్ణారెడ్డి , ఒకవేళ రాజేంద్రప్రసాద్ ఒప్పుకోకపోతే, నరేష్‌ దగ్గరకు వెళ్తాను అని ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి మంచి హిట్స్‌లో ఉన్న నరేష్‌ను సంప్రదించారు. కథ వినిపించి, అడ్వాన్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా, నరేష్ ఒక షరతు విధించారు. సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. డబ్బింగ్‌ స్టేజ్‌కు వచ్చేసరికి నిర్మాతల దగ్గర డబ్బులు ఉండవు సార్, అందుకే