
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vanda Devullu Pre Release Event:విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ‘వంద దేవుళ్లు’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బిచ్చగాడు’ తర్వాత దర్శకుడు శశి, విజయ్ ఆంటోనీ కలిసి చేసిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది. ఈ కార్యక్రమానికి నిహారిక కొణిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శశి తనను మొదట సంగీత దర్శకుడిగా పరిచయం చేశారని, తరువాత ‘బిచ్చగాడు’తో హీరోగా మరో గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. ‘వంద దేవుళ్లు’ కథ విన్నప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని వెల్లడించారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ సినిమా ఇప్పటికే చూసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో తల్లి జీవితంలోని భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించారని అన్నారు. పెళ్లి, పిల్లల తర్వాత మహిళ తల్లిగా మారినా, ఆమెలో ఒక అమ్మాయి ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అదే అంశాన్ని దర్శకుడు శశి హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారని పేర్కొన్నారు. స్వాసిక నటన చాలా బాగుందని, ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని నిహారిక అన్నారు. ‘వంద దేవుళ్లు’ అనే టైటిల్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుందని చెప్పారు. విజయ్ ఆంటోనీ కేవలం నటుడు మాత్రమే కాకుండా మంచి