
గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. BRS Politics: బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉండగానే.. గులాబీ లీడర్లు యాక్టివ్ అయ్యారు. పార్టీని మరోసారి అధికారం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలతో క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదే సమయంలో నేతల మధ్య సీట్ల పంచాయితీ అధినేతకు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే సీట్ల కోసం నేతలు ఇప్పటినుంచే ఖర్చీప్ వేస్తూ.. పార్టీ హైకమాండ్ ను ఇరకాటంలోకి నెడుతున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మాజీమంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ చేసిన కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.. గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గంలో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ అడ్డా.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. 2014 లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ గౌడ్.. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఎన్నికల తర్వాత.. ప్రకాశ్ గౌడ్ అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొద్ది రోజులుగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ రాజేంద్ర