
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు నింపింది. రంగనాథ్ మరణంపై నటుడు శివాజీ రాజా గతంలో కీలక విషయాలు వెల్లడించారు. రంగనాథ్‌తో తనకున్న బలమైన అనుబంధాన్ని, ఆయన చివరి క్షణాలను, ఆ తర్వాత సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శివాజీ రాజా హీరోగా నటించిన మొగుడు పెళ్ళామ్స్ సినిమాకు రంగనాథ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం బలమైన అనుబంధంగా మారిందని శివాజీ రాజా తెలిపారు. రంగనాథ్ తనను ఎప్పుడూ “హీరో” అని పిలిచేవారని, తనతో రెండు సినిమాలు చేయాలనే కోరికను పలుమార్లు వ్యక్తం చేశారని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. ఒకానొక సందర్భంలో, “నేను శివాజీ రాజాను హీరోగా పెట్టి సినిమా తీయాలి. రెండో సినిమా కూడా అతనితోనే తీయాలి” అని రంగనాథ్ బహిరంగంగా చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని శివాజీ రాజా పేర్కొన్నారు. రంగనాథ్ తన ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మరణంపై తీవ్ర ఆవేదన చెందారని శివాజీ రాజా వెల్లడించారు. “ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోబోయే ముందు నాకు ఫోన్ చేసి ఉంటే, నేను సూసైడ్ చేసుకోవడం తప్పు, చేసుకోవద్దు అని అతన్ని మార్చేవాడిని” అని రంగనాథ్ తనతో పర్సనల్‌గా, ఇంటర్వ్యూలలోనూ చెప్పారని శివాజీ రాజా పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, తాను నాలుగైదు రోజులు మనిషిని కాలేకపోయానని శివాజీ రాజా వాపోయారు. రంగనాథ్ తన భార్యను ఎంత అద్భుతంగా చూసుకున్నారో కూడా శివాజీ రాజా వివరించారు. నడుము కింద పనిచేయక వీల్ చైర్‌లో ఉన్న భార్యను రంగనాథ్ మహానుభావుడిలా చూసుకున్నారని, ఆయనతో జర్నీ చేయడం వల్ల ఈ విషయాలు తనకు తెలిశాయని చెప్పారు. రంగనాథ్ భార్య చనిపోయినప్పుడు తాను ఆయన దగ్గరికి వెళ్ళగా, అరగంట తర్వాత