
సాధారణంగా నటుడిగా సక్సెస్ అయితే చాలు లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఒక్క షో హిట్టైతే పారితోషికం లక్షల్లో ఉంటుంది. షూటింగ్కు వెళ్లే ముందు విలాసవంతమైన హోటల్లోని ఏసీ గదిలో ఉంటూ.. అలాగే సినిమా సెట్ కు కారులో వస్తూ.. షూటింగ్ సమయంలో క్యారవాన్.. ఇలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటుంది సెలబ్రెటీలకు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు.. రూ.1000 కోట్లు రాబట్టిన చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు అతడు రోడ్డు పక్కన నిద్రిస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవతుండగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ నటుడే స్వయంగా తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అతను గంగా నది ఒడ్డున ఉన్న ఒక ఆలయంలో భక్తులతో కలిసి నిద్రిస్తున్నాడు. అతడు మరెవరో కాదు.. సునీల్ గ్రోవర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ కమెడియన్. అట్లీ దర్శకత్వంలో, షారుఖ్ ఖాన్ నటించిన 2023 చిత్రం 'జవాన్'లో ముఖ్య పాత్ర పోషించారు. నటుడిగా, హాస్యనటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం.. రోడ్డు పక్కన చిరిగిన దుస్తులు ధరించి పడుకున్న వీడియోను షేర్ చేస్తూ 'తారే జమీన్ పర్ ' అనే క్యాప్షన్ పెట్టాడు. అంటే భూమిపై నక్షత్రాలు అని అర్థం. తన తోటి భక్తులతో కలిసి గంగానది ఒడ్డున నిద్రించారు. తాను సాధారణ జీవితం కొత్తేమి కాదు. కొన్ని నెలల ముందు రోడ్డు పక్కన చేతి పంపు వద్ద బట్టలు ఉతుకుతున్న వీడియోను సైతం పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఆధ్యాత్మిక యాత్రలో ఉండడంతో తన తోటి భక్తులతో కలిసి వీధి పక్కన నిద్రించాడు. ఇప్పుడు ఈ వీడియో చూసి నెటిజన్స్ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది