ఆ కథ వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. స్టేజ్
Actor ProfileActor

ఆ కథ వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. స్టేజ్

Total News1
Movie Updates0
Sources1
ఆ కథ వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన బిచ్చగాడు’ హీరో
NTV Telugu15 Jun 2026
ఆ కథ వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన బిచ్చగాడు’ హీరో

Vijay Antony: వైవిధ్యభరితమైన కథలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో, నిర్మాత విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన ‘వంద దేవుళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బిచ్చగాడు’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ శశితో ఆయన కాంబినేషన్‌లో వస్తున్న ‘నూరు సామి’ (తెలుగులో ‘వంద దేవుళ్లు’) చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. "డైరెక్టర్ శశి గారే 20 ఏళ్ల క్రితం 'డిషుమ్' సినిమాతో నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు 'బిచ్చగాడు' లాంటి ఒక మైలురాయి లాంటి సినిమాను నా కెరీర్‌కు అందించారు. ఆ సినిమా నా పర్సనల్ లైఫ్‌ను, కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. నేను ఎన్ని ప్లాప్ సినిమాలు ఇచ్చినా, ఒక్కసారి టీవీలో బిచ్చగాడు సినిమా వస్తే చాలు.. జనాలు నన్ను మళ్లీ గుండెల్లో పెట్టేసుకుంటారు. నన్ను ఈ రెండు పరిశ్రమల్లో ఒక బలమైన నటుడిగా నిలబెట్టింది ఆ సినిమానే" అని ఎమోషనల్ అయ్యారు. కథ వింటూ ఏడ్చేశాను.. ఫస్ట్ టైమ్ లవర్ బాయ్‌గా.. "శశి గారు ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను, ఏడ్చేశాను. నా కెరీర్‌లో ఇప్పటి వరకు 25 సినిమాలు చేశాను, ఎవరూ నన్ను నటుడిగా పెద్దగా మెచ్చుకోలేదు. కానీ, శశి గారు నన్ను ఈ సినిమాలో ఒక క్యూట్ లవర్ బాయ్‌గా చూపించారు. నా హీరోయిన్ కూడా నన్ను 'చాలా క్యూట్' అని ఆటపట్టించేది (నవ్వుతూ). ఇప్పుడు ఈ సినిమా చూసి చాలా మంది దర్శకులు నన్ను 'లవర్ బాయ్' అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో నాది చాలా చిన్నదైనా, చాలా విభిన్నమైన పాత్ర" అని అన్నారు