ఆ ఒప్పందం ఫైనల్ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులు
Actor ProfilePolitician

ఆ ఒప్పందం ఫైనల్ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులు

Total News1
Movie Updates0
Sources1
ఆ ఒప్పందం ఫైనల్ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులు
Eenadu17 Jun 2026
ఆ ఒప్పందం ఫైనల్ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులు

ఇంటర్నెట్‌ డెస్క్: ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో తాము చేసుకోబోయేది కేవలం అవగాహన ఒప్పందమేనని.. అది ఫైనల్‌ కాదని పేర్కొన్నారు. ఒకవేళ అందులోని అంశాలు తనకు నచ్చకపోతే, ఇరాన్‌ తీరు సరిగ్గా లేకపోతే.. ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామన్నారు. జీ7 సదస్సు నేపథ్యంలో ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో అవగాహన ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేయనున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా- ఇరాన్ ఒప్పందంలో భాగంగా పునర్నిర్మాణ నిధుల కింద టెహ్రాన్‌కు 300 బిలియన్ డాలర్లు సమకూర్చే అంశం ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని ట్రంప్ తెలిపారు. తాము ఒక్క పైసా కూడా వెచ్చించడం లేదన్నారు. ‘‘మేం పెట్టుబడి పెట్టడం లేదు. మా దగ్గర అటువంటి ఫండ్‌ ఏదీ లేదు. ఇరాన్‌ (Iran)లో పెట్టుబడులు పెట్టాలని గల్ఫ్ దేశాలనూ కోరడం లేదు. ఒకవేళ వారు ముందుకొస్తే మాకు అభ్యంతరం లేదు. అయితే.. ఇరాన్‌ ధోరణి ఎలా ఉంటుందో ఒక అవగాహన వచ్చేవరకు కొంతకాలం పాటు ఆ దేశాలు అటువంటి పని చేయకపోవచ్చు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు