
'పెద్ది' సినిమా విడుదలైనప్పుడు రామ్ చరణ్‌ను అభినందించని జూనియర్ ఎన్టీఆర్, 'సింగ్ గీతం' చిత్ర బృందాన్ని అభినందించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. దాంతో ఎన్టీఆర్ ట్రోలింగ్‌కు గురౌతున్నారు. 'అనుమానం మొగుడికి ఒళ్ళంతా కళ్ళే' అనే సామెత ఉండనే ఉంది! సోషల్ మీడియాలో కొంతమంది వెలిబుచ్చే అభిప్రాయాలు చూస్తే... అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత వీళ్ళు పుట్టారేమో అని కూడా అనిపిస్తుంది. ఇంతకూ విషయం ఏమిటంటే... గత శుక్రవారం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్ గీతం' (Sing Geetham) విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత కూడా తెలుగు సినీ ప్రముఖులు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) ను అభినందిస్తూ, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం వయసును లెక్క చేయకుండా సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా తీయడాన్ని మెచ్చుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ను, చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ (Nag Ashwin) ను ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్ ను రిలీజ్ చేయడం సర్ ప్రైజింగ్‌గా అనిపించిందని అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశారు. నిజానికి ఇది అభినందించాల్సిన అంశం. చిరంజీవి మొదలు కొని జూ. ఎన్టీఆర్ వరకూ 'సింగ్ గీతం'ను మెచ్చుకున్న వారే! అయితే... 'సింగ్ గీతం' సినిమాను అప్రిషియేట్ చేసిన జూ. ఎన్టీఆర్.... తన తమ్ముడని చెప్పుకునే రామ్ చరణ్ మూవీ 'పెద్ది' విడుదలైనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి మధ్య వ్యవహారం ఏమైనా బెడిసికొట్టిందా? అని సందేహిస్తున్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడే 'అనుమానం మొగుడికి ఒళ్ళంతా కళ్ళే' అనే సామెత గుర్తుకొస్తుంది. రామ్ చరణ్ - జూ. ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? అనే సందేహాన్ని వ్యక్తం చేసే వాళ్ళు చెబుతున్న మాట ఏమిటంటే... 'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీ విడుదలప్పుడు ఇద్దరూ