
హనుమకొండ చౌరస్తా, జూన్ 27: కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్‌గా దోస్తులు. పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ శిక్షపడేలా ప్రవీణ్ కుమార్ పని చేశారు. అందుకే ఇద్దరి కలిసి కుట్రపన్ని ప్రవీణ్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ ఆరోపించారు. శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ కుమార్ భద్రతలో బుల్లెట్ ప్రూఫ్ కారును తీసివేయాలని, ఎక్స్ కేటగిరి గన్ మెన్స్ సంఖ్యను తగ్గించాలి అని రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయ కుట్రను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రతను ఎందుకు తొలగిస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వెంటనే ప్రభుత్వం పునరాలో చించి భద్రతను పెంచాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని శ్యామ్ హెచ్చరించారు. ఈ సమావే శంలో మారపల్లి మనోజ్, ఒంటెలు చక్రి, మధుకర్, సురేష్, మహిపాల్ పాల్గొన్నారు