ఆయిల్ పామ్ తో కాసుల వర్షం
Actor ProfilePolitician

ఆయిల్ పామ్ తో కాసుల వర్షం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆయిల్ పామ్ తో కాసుల వర్షం
Andhra Jyothy13 Jul 2026
ఆయిల్ పామ్ తో కాసుల వర్షం

జిల్లాలో 2 వేల ఎకరాల నుంచి 6వేల ఎకరాల్లో సాగు టన్ను ధర రూ.23,852 ఏర్గట్ల(నిజామాబాద్): ఓ వైపు ప్రకృతి, మరో వైపు దళారుల ధరలు రైతులను నట్టేట ముంచుతున్న సమయంలో తాను ఆదుకుంటానంటూ ఆయిల్‌పామ్‌ పంట తెరపైకి వచ్చింది. జిల్లాలో దశల వారీగా సాగుచేస్తున్న రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మొదట్లో 2వేల ఎకరాల సాగు నుంచి ప్రస్తుతం 6వేల500 ఎకరాలకు పెరిగింది. గతంలో మెట్రిక్‌ టన్నుల ఆయిల్‌ పామ్‌ రూ.18వేల ధర ఉండగా, ప్రస్తుతం రూ.23వేల 852 పెరి గింది. దీంతో ఆయిల్‌పామ్‌ రైతులు సంబురపడుతున్నారు. రూ.3 కోట్ల మేరకు అమ్మకాలు.. జిల్లాలో నాలుగేళ్లుగా సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ దిగుబడులు రైతులకు పెద్ద ఎత్తున చేతికి వస్తున్నాయి. ఎలాంటి చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేకపోవడంతో దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.3కోట్ల విలువైన పంటను రైతులు విక్రయించినట్లు అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో పడ్డాయి. పంట మార్పిడి వైపు రైతుల అడుగులు.. జిల్లాలో ప్రతీ వానా కాలం, యాసంగిలో రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూమి సారం కోల్పోవడమే కాకుడా ఎక్కువగా పంట పండటం వల్ల సరైన ధర రాక రైతు లు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి పంట మార్పిడిని తప్పనిసరిగా పాటించాలంటూ ప్రభుత్వం సూచనిలిస్తోంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా మంచి ధర ఉండటం, కంపెనీ బాయ్‌ బ్యాక్‌, సాగులో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఆయిల్‌పామ్‌ వైపే రైతులు మొగ్గుచూపు తున్నారు. నెల నెలా ఆదాయం.. వ్యవసాయంలో ఏ పంటకు లేని విధంగా ఆయిల్‌పామ్‌ పంట పెట్టుకున్న రైతులకు నెలనెలా ఆదాయం వస్తుంది. రెండు ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంట పెట్టుకున్న రైతు సరైన సాగు మెలకువలు 3 సంవత్సరాల వరకు పాటిస్తే 36 నెలల తరువాత మొదటి కోత మొదలవుతుంది. అలా

ఆయ ల ప మ త క స ల వర ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in