
ఇంటర్నెట్‌డెస్క్: కాంగ్రెస్- తమిళనాడు డీఎంకే (Congress- DMK)ల మధ్య వైరం రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై డీఎంకే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన పెద్ద జోక్ అంటూ ఎగతాళి చేసింది. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను రాహుల్ బలహీనపరుస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. తమిళనాడు (Tamil Nadu) శాసనసభ ఎన్నికల్లో ఐదు సీట్లు నెగ్గిన కాంగ్రెస్.. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే)కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీన్ని డీఎంకే (DMK) వెన్నుపోటుగా అభివర్ణించింది. దీంతో ఆ పార్టీతో పొత్తును రద్దు చేసుకుంది. ఈ విషయంపై డీఎంకే ఐటీ విభాగం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘కాంగ్రెస్ రాజకీయ ఉనికి కోసం పోరాడుతుండగా.. మేం వారిని మా భుజాలపై మోశాం. కానీ.. ఒక కొత్త బొమ్మ రాగానే వారు మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు’ అని రాసుకొచ్చింది. ఈసందర్భంగా రాహుల్‌ను ఒక పెద్ద జోక్‌గా అభివర్ణించింది. ఇదే సమయంలో డీఎంకే అధికారిక పత్రిక మురసోలి తన సంపాదకీయంలో రాహుల్‌పై విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు తలెత్తడానికి ఆ కాంగ్రెస్ నాయకుడే కారణమని ఆరోపించింది. ఇండియా కూటమి (INDIA bloc) సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ‘ఐక్యత గురించి రాహుల్ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు. కానీ పలు రాష్ట్రాల్లో ఆ ఐక్యతను బలహీనపరిచింది ఎవరు?’ అని ప్రశ్నించింది. కేరళలోని వామపక్ష పార్టీలు ఆయనపై చేసిన విమర్శలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. రాహుల్‌కు రాజకీయ పరిపక్వత, స్థిరత్వం లేకపోవడమే కూటమిలో విభేదాలకు కారణమని అభిప్రాయపడింది. కూటమిలో ప్రస్తుతం ఉన్న అనేక సమస్యలు కాంగ్రెస్ సొంత చర్యల నుంచే మొదలయ్యాయని పేర్కొంది. ఈ విమర్శలపై కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదు. అయితే, తమిళనాడు ప్రజల తీర్పునకు అనుగుణంగానే పార్టీ వ్యవహరించిందని కాంగ్రెస్ వర్గాలు ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని