
‘బేబీ’ సినిమాతో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్’ విడుదల తేదీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సంచారమే’ మంచి ఆదరణ పొందగా, టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్‌లో కనిపించిన విజువల్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. టీజర్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మధ్య రొమాన్స్ బాగా హైలైట్ అయింది. ముఖ్యంగా ‘బేబీ’ తర్వాత ఆనంద్–వైష్ణవి జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. లండన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆధునిక ప్రేమకథగా రూపొందుతోంది. ప్రేమ, సంబంధాలు, యువత ఆలోచనా విధానం వంటి అంశాలను కొత్త కోణంలో చూపించనున్నట్లు టీజర్ సూచించింది. ఇందులో ఆనంద్ దేవరకొండ ఇంట్రోవర్ట్ యువకుడిగా కనిపించగా, వైష్ణవి చైతన్య ఉత్సాహభరితమైన ఎక్స్‌ట్రోవర్ట్ పాత్రలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి ‘90’s – A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ‘సంచారమే’ పాట ఇప్పటికే సంగీత ప్రియుల ప్లేలిస్టుల్లో చోటు దక్కించుకుంది. టీజర్‌కు కూడా మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ కొనసాగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్