ఆధ్యాత్మిక సాధనకు అద్భుత కాలం.. జులైలో ఈ తేదీలను మర్చిపోవద్దు
Actor ProfilePolitician

ఆధ్యాత్మిక సాధనకు అద్భుత కాలం.. జులైలో ఈ తేదీలను మర్చిపోవద్దు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆధ్యాత్మిక సాధనకు అద్భుత కాలం.. జులైలో ఈ తేదీలను మర్చిపోవద్దు
Eenadu21 Aug 2026
ఆధ్యాత్మిక సాధనకు అద్భుత కాలం.. జులైలో ఈ తేదీలను మర్చిపోవద్దు

కాలచక్రంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకవైపు జప, తపాది ఆధ్యాత్మిక సాధనలకు, మరోవైపు ఆకాశంలో జరిగే అద్భుతమైన ఖగోళ మార్పులకు ఈ మాసం వేదిక. పౌర్ణమి నాడు చంద్రుడు ‘పూర్వాషాఢ’ లేదా ‘ఉత్తరాషాఢ’ నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. వర్ష రుతువుకు నాంది పలికే ఈ కాలంలో ఆకాశంలో గ్రహాల కదలికలు భూమిపై వాతావరణాన్ని, అలాగే మానవ జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం! జులై 29న వచ్చే వ్యాస పూర్ణిమ (Guru purnima 2026 date) కేవలం ఆధ్యాత్మిక పర్వదినం మాత్రమే కాదు, ఖగోళ అద్భుతం. ఆధ్యాత్మికంగా చూస్తే, వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, అష్టాదశ పురాణాలను అందించిన వేదవ్యాసుని ఆరాధించే రోజుగా ఈ రోజును జరుపుకొంటాము. పరివ్రాజకులు చాతుర్మాస్య దీక్షను (chaturmas 2026 start date) ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ఖగోళ శాస్త్ర పరంగా, ఈ సంవత్సరం గురుపూర్ణిమ నాడు గురువు ఉచ్ఛ రాశిలో ఉండడం విశేషం. జ్యోతిష పరంగా, రవి-గురు గ్రహ సంయోగం అంటే సంపూర్ణ మౌఢ్యమి స్థితి. ఈ సమయంలో చేసే జప, ధ్యానాలకు విశేషమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. గురు ధ్యానం చేయడం, గురువులకు నమస్కరించడం, వ్యాస పూజ మొదలైనవి శ్రేయస్సునిస్తాయి. ఈ మాసంలో ఖగోళపరంగా జరిగే అతి పెద్ద ఘట్టం దక్షిణాయన (dakshinayana 2026) ప్రారంభం. జులై 17వ తేదీన ఉదయం 11:04 గంటలకు సూర్య భగవానుడు నిరయణ రాశి చక్రంలో పునర్వసు నక్షత్రం 4వ పాదంతో పాటు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ‘కర్కాటక సంక్రమణం’ అంటారు. ఉత్తరం వైపుగా ప్రయాణించే సూర్యుడు, ఈ రోజు నుంచి తన దిశను మార్చుకుని దక్షిణ దిశగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా ప్రయాణించే ఈ ఆరు నెలల కాలాన్ని ‘దక్షిణాయనం’ అంటారు. శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు కాగా, దక్షిణాయనం