ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు
Actor ProfilePolitician

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు
Sakshi19 Jun 2026
ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ 17 నాటికి నికర ఆదాయపన్ను (ప్రత్యక్షపన్ను) వసూళ్లు 15 శాతం వరకు పెరిగి రూ.5.21 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా స్పష్టం చేసింది. నికర కార్పొరేట్‌ పన్నుల వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం వృద్ధితో రూ.2.08 లక్షల కోట్లకు చేరాయి. నికర నాన్‌ కార్పొరేట్‌ పన్నుల ఆదాయం 8 శాతం పెరిగి రూ.2.94 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, వాణిజ్య సంస్థల పన్నులు నాన్‌ కార్పొరేట్‌ కిందకు వస్తాయి. రిఫండ్‌లు మే 17 నాటికి రూ.89,026 కోట్లుగా ఉన్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూపంలో ఆదాయం 45 శాతం పెరిగి రూ.18,856 కోట్లకు చేరింది. ముందస్తు పన్ను చెల్లింపులు 15.30 శాతం అధికమై రూ.1.78 లక్షల కోట్లు వసూలయ్యాయి. స్థూల పన్ను వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు జూన్‌ 17 నాటికి 12.46 శాతం పెరిగి రూ.6.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.26.97 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ లక్ష్యంగా ఉంది. డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు) హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు) సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు) వాడు అల్లుడు కాదు సైకో.. చిత్రహింసలు పెట్టి చంపేశాడు సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..! అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్ ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్ నా చావుకు CI నాగరాజే కారణం.. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో

ఆద యపన న వస ళ ల ర 5 21 లక షల క ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in