ఆక్వా అమ్మమ్మ
Actor ProfileCelebrity

ఆక్వా అమ్మమ్మ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆక్వా అమ్మమ్మ
Sakshi23 Jul 2026
ఆక్వా అమ్మమ్మ

వయసు 78. హుషారు మాత్రం 18. ఉదయం 5 గంటలకే లేచి స్విమ్మింగ్‌ పూల్‌లో దూకుతుంది. నీళ్లలో యోగాసనాలు వేస్తుంది. ‘మనసును బట్టే వయసు’ అని నవ్వుతూ చెబుతుంది. కొచ్చీలో నివసించే రిటైర్డ్‌ నర్సు అన్నమ్మ జీవితం ఇప్పుడు అందరికీ పాఠం. అన్నమ్మ వయసు 78. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసి రిటైర్‌ అయింది. సాధారణంగా ఈ వయసు వారు మనుమలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తారు. కానీ అన్నమ్మ మాత్రం రోజూ ఉదయం 5:30కి తన ఇంటికి దగ్గరలోని స్విమ్మింగ్‌ పూల్‌కి వెళ్తుంది. గంటన్నర పాటు ఆక్వా యోగా చేస్తుంది. నీళ్లలో సూర్య నమస్కారాలు,ప్రాణాయామం, ధ్యానం... అన్నీ చేస్తుంది. ’నీళ్లలో ఉంటే బరువు తెలియదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది’ అంటోందామె. నర్సు నుంచి ‘అక్వా యోగి’ అన్నమ్మ 1998లో నర్సుగా రిటైర్‌ అయింది. మొదట్లో ఇంట్లోనే ఉండేది. కానీ 65 ఏళ్ల వయసులో మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఆర్థరైటిస్‌ అని డాక్టర్లు చె΄్పారు. ‘ఇక మంచానికే పరిమితం’ అని అంతా అనుకున్నారు. కానీ అన్నమ్మ ఒప్పుకోలేదు. యూట్యూబ్‌లో ఆక్వా యోగా గురించి చూసింది. ‘నీళ్లలో వ్యాయామం చేస్తే కీళ్ల మీద ఒత్తిడి పడదు’ అని తెలుసుకుంది. వెంటనే దగ్గర్లోని స్విమ్మింగ్‌ పూల్‌లో చేరింది. కోచ్‌ సాయంతో మెల్లగా ఈత నేర్చుకుంది. ఇప్పుడు ఆమెను చూసి 20 ఏళ్ల పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. నీళ్లే ముందు, నీళ్లే మందు అన్నమ్మ దినచర్య వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఉదయం 5 గంటలకు లేస్తుంది. వేడి నీళ్లు తాగి, పళ్లు తిని నేరుగా పూల్‌కి వెళ్తుంది. 5:30 నుంచి 7 వరకు ఆక్వా యోగా. నీళ్లలో తేలుతూ పద్మాసనం, వజ్రాసనం, భుజంగాసనం వేస్తుంది. యోగా అయ్యాక ఇంటికొచ్చి అందరికీ వంట చేసి పెడుతుంది. సాయంత్రం మనవరాళ్లకు కథలు చెబుతుంది. ‘రిటైర్‌ అయ్యాక జీవితం అయిపోయిందని అనుకోవద్దు. అసలు జీవితం అప్పుడే మొదలవుతుంది’ అనేది ఆమె ఫిలాసఫీ. ‘మనసులో యవ్వనం ఉండాలి

ఆక వ అమ మమ మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in