
Video : భారత యువ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య దాంబూలా వేదికగా జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అయితే ఈ


Video : భారత యువ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య దాంబూలా వేదికగా జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అయితే ఈ

Vaibhav Sooryavanshi : శ్రీలంక వేదికగా దాంబూలా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి ఆటగాడిని నెట్టేసిన ఉదంతం వెనుక అసలు కారణాలు బయటకు వచ్చాయి. సూపర్ ఓవర్

భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. అయితే, శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్‌ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్‌కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు. అయితే, కాసేటికే తిలక్‌ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్‌కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్‌కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది. మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్‌గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు