అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్ బోల్డ్ కామెంట్ .. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్
Actor ProfileCelebrity

అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్ బోల్డ్ కామెంట్ .. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్ బోల్డ్ కామెంట్ .. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్
Asianet News Telugu17 Jun 2026
అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్ బోల్డ్ కామెంట్ .. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్

రాము రాథోడ్‌.. ఎలాంటి సినిమా బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు ఫోక్‌ స్టార్‌గా ఎదిగాడు. `రాను బొంబాయికి రాను` అనే ఒక్క పాటతో ఆయన స్టార్‌ అయిపోయాడు. ఈ పాట రాము రాథోడ్‌ జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు ఫోక్‌ సామ్రాజ్యానికి కింగ్‌ని చేసింది. వరుసగా ఓ వైపు ఫోక్‌ సాంగ్స్, మరోవైపు సినిమా పాటలతో ఆకట్టుకుంటున్నాడు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మరోసారి ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎమోషనల్‌ అయ్యాడు. ఇప్పుడు అంతా తనని వాడుకునేటోళ్లే ఉన్నారని చెబుతున్నాడు. రాము రాథోడ్‌.. చాలా రేర్‌గా పబ్లిక్‌ లోకి వస్తుంటాడు. తాజాగా ఆయన వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నాడు. అందులో భాగంగా తేజస్విని మదివాడ నిర్వహించిన ఒక టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బిగ్‌ బాస్‌ నుంచి ఎందుకు వెళ్లిపోయావని అడిగితే, అమ్మానాన్న గుర్తుకు వచ్చారని తెలిపాడు. వాళ్లని చాలా మిస్‌ అయినట్టు చెప్పాడు. అదే సమయంలో తనకు అవకాశాల కోసం ఆఫీస్‌ ల చుట్టూ తిరిగే టైమ్‌ లేదని, కొడితే సెలబ్రిటీ అయిపోవాలి, మీ వద్ద కూర్చునే స్థాయికి ఎదగాలి అని భావించినట్టు తెలిపాడు, అందుకే ఫోక్‌ సాంగ్‌లను ఎంచుకున్నట్టు వెల్లడించాడు. ఈ క్రమంలో రాము రాథోడ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తన పేరెంట్స్ గురించి చెబుతూ, తాము చాలా పేదరికం నుంచి వచ్చామని, నాన్న 200రూపాయల కూలీకి వెళ్లేవారట. అమ్మ యాభై రూపాయల కూలీకి వెళ్లేదట. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండేది కాదన్నాడు రాము రాథోడ్‌. అలాంటి పరిస్థితిని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్‌, హార్ట్ టచ్చింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ మధ్య వాళ్ల నాన్న నువ్వు మాకు దేవుడివిరా అని అన్నాడట. ఆ మాట తనని కదిలించిందని భావోద్వేగానికి గురయ్యాడు రాము రాథోడ్‌. ఈ సందర్భంగా ఇంకో షాకింగ్‌ విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు రాము రాథోడ్‌. తనకు ఇంతటి సక్సెస్‌