
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Venu swamy controversy comments on marriages: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరో సారి వార్తలలో నిలిచారు. ఇప్పటికే నాగార్జున కుటుంబం, ప్రభాస్ పెళ్లి, సమంతపై రచ్చ, రష్మికమందన్నలపై వేణు స్వామి ఏ రెంజ్ లో కాంట్రవర్సీ చేశారో అందరికి తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితం నటి ప్రగతి పతకాలు గెల్చిన కూడా తన క్రెడిట్ అంటూ మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. వేణుస్వామి వివాదం తెలంగాణ మహిళ కమిషన్ వరకు సైతం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంట్రవర్సీ జ్యోతిష్యాల జోలికి పోనని కూడా చెప్పారు. కానీ మరల రోటీన్ గా వేణు స్వామిఏదో ఒక కాంట్రవర్సీలతో నిత్యం వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారంగా మారాయి. వేణుస్వామి మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిల్ని భార్యలుగా చేసుకున్న వారు తొందరగా చచ్చిపోతారని బాంబు పేల్చారు. వీరిలో చాలా మంది తొందరగా విడిపోవడం లేదా డైవర్స్ లు తీసుకొవడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా అమ్మాయిలు ఎక్కువగా తులసీ మొక్కల లాంటి మంచి వారిని కాదని గంజాయి మొక్కల లాంటి చెడు గుణాల్ని ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడుతారని అన్నారు. ఇది కలియుగం అని అందుకు దీని ప్రభావంతో అమ్మాయిలు ఎక్కువగా చెడు గుణాలు ఉన్నవారి పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని మాట్లాడారు. కొంత మంది పెళ్లిళ్ల సమయంలో జాతకాలు కలవక పోతే పేర్లు మార్చుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారని దీని వల్ల కూడా చాలా దోషాలు వస్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా