
Eenadu•21 Jul 2026
అంత్యోదయ అన్నయోజన స్కీమ్ లో మార్పులుదిల్లీ: అంత్యోదయ అన్న యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 7 కిలోల ఆహారధాన్యాలు ఇచ్చేలా పథకంలో మార్పు చేయబోతోంది. 35 కిలోల గరిష్ఠ పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగించాలనుకుంటోంది. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం, 2013ను సవరించాలని భావిస్తోంది. దీనిపై జులై 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. 👉మరిన్ని వివరాలు అంత్యోదయ అన్నయోజన స్కీమ్‌లో మార్పులు