అంచనాలు పెంచేసిన నోలన్ 'ది ఒడిస్సీ'.. కౌంట్ డౌన్ ట్రైలర్ వచ్చేసింది
Actor ProfileActor

అంచనాలు పెంచేసిన నోలన్ 'ది ఒడిస్సీ'.. కౌంట్ డౌన్ ట్రైలర్ వచ్చేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అంచనాలు పెంచేసిన నోలన్ 'ది ఒడిస్సీ'.. కౌంట్ డౌన్ ట్రైలర్ వచ్చేసింది
AP7AM2 Sept 2026
అంచనాలు పెంచేసిన నోలన్ 'ది ఒడిస్సీ'.. కౌంట్ డౌన్ ట్రైలర్ వచ్చేసింది

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చిత్రం ‘ది ఒడిస్సీ’ నుంచి ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. యూనివర్సల్ పిక్చర్స్ రిలీజ్ చేసిన ఈ 'కౌంట్‌డౌన్ ట్రైలర్' సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గ్రీక్ పురాణాల ఆధారంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కుతోంది.ట్రోజన్ యుద్ధం ముగిశాక ఇథాకా రాజు 'ఒడిస్సియస్' తన రాజ్యానికి, భార్య వద్దకు తిరిగి రావడానికి పదేళ్లపాటు చేసిన ప్రమాదకర ప్రయాణమే ఈ సినిమా కథ. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సముద్రపు తుపానులు, భయంకరమైన రాక్షసులతో పోరాటాలు, యుద్ధ సన్నివేశాలను గ్రాండ్‌గా చూపించారు. నోలన్ మార్క్ విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.ఈ చిత్రంలో ఒడిస్సియస్ పాత్రలో ప్రముఖ నటుడు మాట్ డామన్ నటించ‌గా, అతని భార్య పెనెలోప్ పాత్రలో అన్నే హాత్వే కనిపించనుంది. వీరితో పాటు టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, షార్లిజ్ థెరాన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈ నెల‌ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది