
భారతదేశ పాస్‌పోర్ట్ ఉంటే.. మీరు భారత పౌరులని ఖచ్చితంగా చెప్పలేం! – కేంద్ర ప్రభుత్వం గురువారం చేసిన ఈ స్పష్టీకరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పొలిటికల్, లీగల్ చర్చకు తెరలేపింది. సాధారణ ప్రజలు పాస్‌పోర్ట్‌ను దేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ గుర్తింపు పత్రంగా భావిస్తున్న తరుణంలో.. అది పౌరసత్వానికి తిరుగులేని సాక్ష్యం లేదా ఖచ్చితమైన రుజువు కాదని, ఈ విషయంలో గత 12 ఏళ్లలో గానీ, లేదా ఇటీవల గానీ ఎలాంటి కొత్త నిర్ణయం లేదా మార్పులు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.ఇటీవల విదేశాంగ శాఖ (MEA) నిర్వహించిన ఒక మీడియా బ్రీఫింగ్‌లో.. పాస్‌పోర్ట్ అనేది ప్రాథమికంగా కేవలం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు ఉపయోగించే ప్రయాణ సౌలభ్య పత్రం (Travel Document) మాత్రమేనని, అది దేశ పౌరసత్వాన్ని స్వయంచాలకంగా నిర్ధారించదని పేర్కొనడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.పాస్‌పోర్ట్‌ల చట్టం, 1967: సెక్షన్ 20’ లో ఏముంది?ఈ వివరణకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా అమల్లో ఉన్న చట్టబద్ధమైన స్థితినే ముందుకు తెచ్చింది. పాస్‌పోర్ట్‌ల చట్టం, 1967 లోని సెక్షన్ 20 (Section 20 of the Passports Act, 1967) నిబంధనల ప్రకారం.. భారత ప్రభుత్వం పౌరులు కాని వారికి (Non-Citizens) కూడా ప్రత్యేక పరిస్థితుల్లో, అంతర్జాతీయ నిబంధనలు లేదా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైనప్పుడు పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాలను జారీ చేసే సర్వాధికారాలను కలిగి ఉంది.సెక్షన్ 20 నిబంధన చట్టంలో ఇలా ఉంది:పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాల జారీకి సంబంధించిన నిబంధనలలో ఏమున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావిస్తే, భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాన్ని జారీ చేయవచ్చు లేదా జారీ చేసేలా చర్యలు తీసుకోవచ్చు.చట్టంలోనే పౌరులు కాని వారికి కూడా పాస్‌పోర్ట్ ఇచ్చే వెసులుబాటు ఉన్నందున.. కేవలం పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన