అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్టు
Actor ProfilePolitician

అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్టు

Total News2
Movie Updates0
Sources1
నేనైతే వైభవ్ ను పక్కన పెట్టేవాడిని మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
Vaartha17 Jun 2026
నేనైతే వైభవ్ ను పక్కన పెట్టేవాడిని మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

Surya Vaibhav : శ్రీలంక ‘ఎ’ (Sri Lanka A) ఆటగాళ్లతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో గొడవకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాస్పద ప్రవర్తనపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ

అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్టు
Vaartha17 Jun 2026
అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్టు

Yoshitha Rajapaksa : శ్రీలంక రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషిత రాజపక్సను అవినీతి, అక్రమాల ఆరోపణలపై అక్కడి దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. శ్రీలంక నేవీ (నౌకాదళం) లో ఆయన నియామకం, ఆ తర్వాత విదేశాల్లో పొందిన సైనిక శిక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులపై సుదీర్ఘ కాలంగా విచారణ సాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే శ్రీలంక బ్రైబరీ కమిషన్ (అవినీతి నిరోధక శాఖ) యోషితను విచారణకు పిలిపించి, ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఆయనను అదుపులోకి తీసుకుంది. దేశాన్ని సుదీర్ఘ కాలం ఏలిన శక్తివంతమైన రాజపక్స కుటుంబానికి చెందిన కీలక వ్యక్తి అరెస్ట్ కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. Read Also : అమెరికాలో భారతీయ టెక్కీకి నరకం.. గ్రీన్ కార్డ్ పేరుతో ₹94 లక్షలు నొల్లేసిన దేశీ సీఈఓ! యోషిత రాజపక్సపై ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని విచారణాధికారులు పేర్కొంటున్నారు. శ్రీలంక నౌకాదళంలో చేరడానికి అవసరమైన కనీస అర్హతలు, నిబంధనలు లేకపోయినప్పటికీ, తన తండ్రి అధికార బలాన్ని ఉపయోగించి ఆయన నేవీలో అత్యున్నత స్థానాన్ని దక్కించుకున్నారని ప్రధాన ఆరోపణ ఉంది. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు చెందిన భారీ నిధులను దుర్వినియోగం చేస్తూ, బ్రిటన్ (UK) లోని ప్రతిష్టాత్మక సైనిక శిక్షణ పొందేందుకు వెళ్లారనే బలమైన సాక్ష్యాలు వెలుగుచూశాయి. అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ధనం దారిమళ్లింపు, నియామకాల్లో అవకతవకలపై బ్రైబరీ కమిషన్ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ అరెస్టుతో రాజపక్స కుటుంబం చుట్టూ ఉన్న అవినీతి ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది. Operation Kagar: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..మహిళా నేత శకుంతల సరెండర్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Donald Trump: ఆ