అవకాశాలు తగ్గినా పర్లేదు!
Actor ProfileActor

అవకాశాలు తగ్గినా పర్లేదు!

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అవకాశాలు తగ్గినా పర్లేదు! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema13 Aug 2026
అవకాశాలు తగ్గినా పర్లేదు! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని బాలీవుడ్ నటి సోనాక్షి (Sonakshi Sinha) సిన్హా అంటోంది. ఒకప్పుడు ఇతరులను సంతోషపెట్టడం కోసం కొన్ని సినిమాలు చేసినా, ఇప్పుడు మాత్రం తనకెంతో తృప్తినిచ్చే, నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఒకవేళ ఆశించిన కథలు రాకపోయినా తన సొంత ప్రపంచంలో తాను చాలా సంతోషంగా ఉంటానని, కెరీర్ లో ఇప్పటివరకు సాగిన ప్రయాణం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదని అంటోంది ఈ బబ్లీ బ్యూటీ. ఇటీవల ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ‘సిస్టమ్’ (System) అనే సిరీస్‌లో లాయర్ పాత్రలో నటించిన సోనాక్షి, దీనిపై వస్తున్న ప్రశంసల పట్ల చాలా ఆనందంగా ఉంది. ‘దహాద్’ లో పోలీస్ ఆఫీసర్‌గా, ‘హీరామండి’ లో వేశ్యగా విభిన్నమైన పాత్రల్లో మెప్పించిన సోనాక్షి.. తన మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నానని స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి పాత్రలు రాకపోయినా పర్లేదు అనే విధంగా స్పందించింది. ఆమెకు సినిమా అవకాశాలు పూర్తిగా అడుగంటాయి. బాలీవుడ్ లో అరకొరగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో సుధీర్ బాబుతో చేసిన ఓ సినిమా (Jatadhara)తో పాతుకుపోదాం అనుకుంది, కానీ అది అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ ఇటువైపు నుంచి ఛాన్సులు రాలేదు

అవక శ ల తగ గ న పర ల ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in